Hyderabad, ఏప్రిల్ 6 -- Tribanadhari Barbarik Director Mohan Srivatsa About Sathyaraj: బాహుబలి సినిమాలో కట్టప్పగా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న సత్యరాజ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా త్రిబాణధారి బార్భరిక్. స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పకుడిగా విజయపాల్ రెడ్డి అడిదల ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.

త్రిబాణధారి బార్భరిక్ మూవీకి డైరెక్టర్ మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. వానర సెల్యూలాయిడ్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్‌తోపాటు సత్యం రాజేష్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయభాను, క్రాంతి కిరణ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన పాటలు, గ్లింప్స్, టీజర్‌‌లు అంచనాల్ని పెంచేశాయి.

ఇక ఇటీవలే మరో ఫీల్ గుడ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. త్రిబాణధారి బార్భరిక్ మూవీలోని అనగా అనగా కథలా అంటూ సాగే ఈ పాటను ...