హైదరాబాద్,సరూర్ నగర్, మార్చి 26 -- సరూర్‌నగర్ అప్సర హత్య కేసులో పూజారికి జీవిత ఖైదు పడింది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కోర్టు తుది తీర్పును వెలువరించింది. 2023లో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

అప్సర అనే యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రేమాయణం నడిపిన పూజారి సాయికృష్ణ.... అప్సరను చంపి సెప్టిక్‌ ట్యాంక్‌లో మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. అంతేకాకుండా సాక్ష్యాలను లేకుండా ప్రయత్నం చేయగా. అసలు విషయం బయటికి రావటంతో పూజారిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.

ఈ కేసును దర్యాప్తు చేసిన సరూర్‌ నగర్‌ పోలీసులు సాక్ష్యాలను కోర్టుకు సమర్పించారు. విచారణ జరిపిన న్యాయస్థానం.. సాయికృష్ణకు జీవిత ఖైదు విధించింది. సాక్ష్యాలను తారుమారు చేసేందుకు యత్నించటంతో మరో ఏడేళ్ల పాటు జైలు శిక్షను ఖరారు చేసింది.

2023 జూన్‌ 3న అప్సర హత్య జరిగింది. శంషాబాద్‌...