Hyderabad, ఏప్రిల్ 16 -- Sarangapani Jathakam Trailer: ప్రియదర్శి లీడ్ రోల్లో నటిస్తున్న మూవీ సారంగపాణి జాతకం. ఓ వెరైటీ టైటిల్ తో వస్తున్న ఈ కామెడీ డ్రామా నుంచి బుధవారం (ఏప్రిల్ 16) ట్రైలర్ రిలీజైంది. కేవలం నవ్వులు పూయించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా ఈ ట్రైలర్ ఉంది. మోహనకృష్ణ ఇంద్రగంటి ఈ మూవీని డైరెక్ట్ చేశాడు.

సారంగపాణి జాతకం.. ఇప్పటికే పలుమార్లు రిలీజ్ వాయిదా పడిన ఈ సినిమా మొత్తానికి ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఓ బోల్డ్ డైలాగుతోపాటు ట్రైలర్ మొత్తం నవ్వులు పూయించేలా సాగింది. ప్రియదర్శి, వెన్నెల కిశోర్, హర్ష త్రయం పోటీ పడి మరీ నవ్వించడానికి ప్రయత్నించారు. మూవీలో ఫిమేల్ లీడ్ గా రూపా కొడువాయూర్ నటించింది.

ఈ ట్రైలర్ ఓ హత్య చేసినట్లుగా కలగనే సారంగపాణి (ప్రియదర్శి) ఉలిక్కి పడి లేవడంత...