Hyderabad, మార్చి 20 -- Saptagiri About Pelli Kani Prasad Movie And Director: టాలీవుడ్‌లో కమెడియన్‌గా అలరించిన సప్తగిరి హీరోగా పేరు తెచ్చుకుంటున్నాడు. సప్తగిరి హీరోగా చేస్తున్న మరో కొత్త సినిమా పెళ్లి కాని ప్రసాద్. అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియాంక శర్మ హీరోయిన్‌గా నటించింది.

థామ మీడియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజన్ గ్రూప్‌ కె.వై. బాబు, భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల కలిసి నిర్మించి పెళ్లి కాని ప్రసాద్ మార్చి 21న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సప్తగిరి పలు ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నాడు.

-సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్.ఎల్.బి, వజ్ర మకుట దర గోవిందా.. ఈ మూడు సినిమాలు కమర్షియల్ జోనర్‌లో ...