Hyderabad, ఏప్రిల్ 4 -- చర్మం సహజంగా, ఆరోగ్యంగా మారాలని కోరుకుంటున్నారా? ఇందుకోసం నేచురల్ ఫేస్‌ప్యాక్‌ల కోసం వెతుకుతున్నారా? అయితే సపోటా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన సపోటాలను మీ బ్యూటీ రొటీన్‌లో చేర్చుకోవడం వల్ల చర్మం సహజ కాంతిని పొందుతుంది. యవ్వనంగా, ప్రకాశవంతంగా మారి వృద్ధాప్య ఛాయల తగ్గుతాయి. చర్మారోగ్యానికి సపోటా ఎలా ఉపయోగపడుతుంది. దీంతో ఎన్ని రకాల ఫేస్‌ప్యాక్‌లు వేసుకోవచ్చో తెలుసుకుందాం రండి.

సపోటాతో చర్మానికి కలిగే ముఖ్యమైన ప్రయోజనాల్లో హైడ్రేషన్ ఒకటి. దీనిలోని విటమిన్-ఈ కంటెంట్ చర్మాన్ని లోతుగా హైడ్రేట్ చేస్తుంది. సహజమైన మాయిశ్చరైజర్ గా పని చేస్తుంది. చర్మం తేమను నిలుపుకోవడంలో, పొడిబారకుండా మారడంలో, మృదువైన ఆకృతిని పొందడంలో సపోటా చాలా బాగా ఉపయోగపడుతుందని అధ్యయనాలు చెబుతున్న...