భారతదేశం, డిసెంబర్ 15 -- Saphala Ekadashi vrata katha: సఫల ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి. అలాగే చాలా మంది ఆ రోజు ఉపవాసం ఉంటారు. చేపట్టిన పనులన్నీ విజయవంతం కావాలనే సఫల ఏకాదశి నాడు వీటిని పాటించడం జరుగుతుంది. అయితే సఫల ఏకాదశి నాడు ఈ వ్రతాన్ని ఆచరించే వారు తప్పక వ్రత కథ చదువుకోవాలి. ఆ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ సఫల ఏకాదశి వ్రత మహత్యాన్ని శివుడు స్వయంగా పార్వతి దేవికి చెప్పాడని పద్మ పురాణంలో చెప్పబడింది. సఫల ఏకాదశి నాడు ఈ వ్రత కథను చదువుకుని, శిరస్సుపై అక్షింతలు వేసుకుంటే వ్రతం సంపూర్ణమవుతుంది. వ్రత ఫలితాన్ని పొందవచ్చు.

సఫల ఏకాదశి నాడు జాగరణ చేసి ఆలయాల్లో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. ఐదు వేల సంవత్సరాలు తపస్సు చేసిన ఫలితం కలుగుతుంది. ఈ వ్రతానికి సమానమైన యజ్ఞం లేదు, తీర్థం లేదు. సఫల ఏకాదశి విశిష్టతను చాటి...