భారతదేశం, డిసెంబర్ 11 -- Saphala Ekadashi: ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి. ఏకాదశి తిథికి ఎంతో విశిష్టత ఉంది. ఏకాదశి నాడు విష్ణువును పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి, ఆనందంగా ఉండొచ్చు. మార్గశిర మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి చాలా విశేషమైనదైనందున సఫల ఏకాదశి అని అంటారు. డిసెంబర్ 15న ఈ వచ్చే సఫల ఏకాదశి వ్రతం చాలా ఫలితమైనది అని చెబుతారు. మార్గశిర మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే ఈ సఫల ఏకాదశి నాడు ఏం చేయాలి? ఎలాంటి పరిహారాలను పాటిస్తే మంచి జరుగుతుంది? ఇప్పుడు తెలుసుకుందాం.

మార్గశిర మాసంలో వచ్చే సఫల ఏకాదశి నాడు విష్ణువును భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే విజయాలను అందుకోవచ్చు. ఈ తిథి అందుకు చాలా ఉత్తమమైనది. ఆ రోజు చేసే పరిహారాలు కూడా చాలా మంచి ప్రభావాన్ని చూపిస్తాయి.

సఫల ఏకాదశి వ్రతాన్ని డిసెంబర్ 15న జరుపుకోవాలి. డిసెంబర్ 14 సాయంత్రం ఏకాదశి తిథి మొదలవ...