భారతదేశం, డిసెంబర్ 4 -- హిందువులు ఏకాదశిని పర్వదినంగా భావిస్తారు. ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి. ఒకటి శుక్ల పక్షంలో, మరొకటి కృష్ణ పక్షంలో. సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. ఏకాదశి నాడు విష్ణువును భక్తి, శ్రద్ధలతో ఆరాధించి ఉపవాసం ఉంటే ఎంతో మంచి జరుగుతుందని; విష్ణు అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చని నమ్ముతారు.

మార్గశిర మాసంలో వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని సఫల ఏకాదశి అని అంటారు. సఫల ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ఆరాధించడం వలన విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి విజయాలను అందుకోవచ్చు. జీవితంలో ఉన్న అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ ఏడాది సఫల ఏకాదశి డిసెంబర్ 15న వచ్చింది. ఆ రోజు విష్ణువును ఆరాధించడంతో పాటు కొన్ని తప్పులు చేయకుండా చూసుకోవాలి.

ఏకాదశి తిథి డిసెంబర్ 14, 2025 ఆదివారం మధ్యాహ్నం 04:48 గంటలకు మొదలవుతుంది. డిసెంబర్ 15, సోమవారం మధ్యాహ్నం 03:59 గంట...