భారతదేశం, జనవరి 12 -- Sankranti Special Trains : సంక్రాంతి రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. సికింద్రాబాద్-విశాఖపట్నం-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ ప్రెస్( రైలు నంబర్ 20707 / 20708) జనవరి 13 నుంచి 16 కోచ్‌లతో నడుస్తుందని రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం 8 కోచ్‌లతో (530 ప్యాసింజర్ కెపాసిటీ) నడుస్తున్న ఈ రైలు 16 కోచ్‌ల (1,128 ప్యాసింజర్ కెపాసిటీ)తో రేపటి నుంచి ప్రయాణికులకు అందుబాటులో వస్తుందని వెల్లడించారు. గతంలో ఒక ఎగ్జిక్యూటివ్ క్లాస్, 07 చైర్ కార్లు ఉన్నాయి. కొత్త కంపోజిషన్‌లో 1,024 కెపాసిటీతో 14 చైర్ కార్లు ఉంటాయి.02 ఎగ్జిక్యూటివ్ క్లాస్ 104 కెపాసిటీతో నడపనున్నారు.

కోచ్‌ల రెట్టింపుతో ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు వందే భారత్ రైలు సేవలను వినియోగించుకుంటారని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జై...