భారతదేశం, జనవరి 11 -- Sankranti Rush : హైదరాబాద్ సహా పలు రాష్ట్రాల నుంచి సంక్రాంతి సమయంలో ఏపీకి పెద్ద ఎత్తున ప్రజలు వస్తుంటారు. సంక్రాంతికి అనుగుణంగా ఏపీఎస్ఆర్టీసీ 7200 ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. అయినప్పటికీ సమయానికి బస్సులు అందుబాటులో లేక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు సీఎం చంద్రబాబు ఆర్టీసీ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ప్రయాణికులను వీలైనంత తొందరగా వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రైవేటు స్కూల్స్, కాలేజీల బస్సులు ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రధాన పట్టణాల నుంచి పల్లెలకు ప్రయాణికులను పంపేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, రవాణా అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు.

ఫిట్‌నెస్‌ ఉన్న బస్సులను ఎంపిక చేసి, ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు వాటిని ఉపయోగించాలన...