భారతదేశం, జనవరి 7 -- హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి ఒకటి. సంక్రాంతి పండుగను పెద్ద పండుగ అని అంటారు. ఈ సంక్రాంతి పండుగను నాలుగు రోజుల పాటు జరుపుతారు. మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమ, నాలుగవ రోజు ముక్కనుమ పండుగలను జరుపుతారు. అయితే ఈసారి ఈ సంక్రాంతి ఎప్పుడు వచ్చింది అనే విషయంలో కాస్త కన్ఫ్యూజన్ ఉంది. మరి సంక్రాంతి ఎప్పుడు వచ్చింది? సంక్రాంతి పండుగ తేదీలతో పాటు పుణ్యకాలం, శుభ ముహూర్తాల గురించి కూడా పూర్తి వివరాలు తెలుసుకుందాం.

మన భారతీయ సంస్కృతిలో మకర సంక్రాంతికి ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది. సూర్యుడు ధనస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటాము. చీకటి నుంచి వెలుగులోకి ప్రయాణాన్ని ఇది సూచిస్తుంది. ఈ ఏడాది మకర సంక్రాంతితో పాటు ఏకాదశి కూడా కలిసి రావడం జరిగింది.

ఈ ఏడాది ...