భారతదేశం, జనవరి 14 -- హిందువులు జరుపుకునే ప్రధానమైన పండుగలలో సంక్రాంతి పండుగ ఒకటి. మూడు రోజుల పాటు సంక్రాంతిని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజు భోగితో సంక్రాంతి పండుగ మొదలవుతుంది. రెండవ రోజు, అంటే భోగి తర్వాత రోజు సంక్రాంతి.

మూడవ రోజు కనుమ పండుగను జరుపుకుంటాము. సంక్రాంతి పండుగ అంటే అందరికీ గుర్తొచ్చేది కొత్త బట్టలు, పిండి వంటలు, గాలిపటాలు ఎగరవేయడం, హరిదాసు కీర్తనలు, భోగి మంటలు, భోగి పండ్లు, గంగిరెద్దులు, సందడి, సరదాలు ఇలా ఉంటాయి. అయితే ఆధ్యాత్మికంగా చూసుకున్నట్లయితే ఈ మూడు రోజులు కూడా చాలా ముఖ్యమైనవి. ప్రధానంగా కొన్ని పనులు చేయాలి. మరి ఆధ్యాత్మికంగా చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏంటి? ఈ మూడు రోజులు కూడా ఎటువంటి వాటిని ఆచరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

భోగి పండుగ పీడను వదిలించుకోవడానికి మంచి రోజు. భోగి పండుగ నాడు పీడను వదిలించుకోవడానికి భోగి...