భారతదేశం, మార్చి 2 -- థియేటర్లలో అంచనాలకు మించి బంపర్ హిట్ అయిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం.. ఓటీటీలోనూ రికార్డులను బద్దలుకొట్టింది. ఓటీటీ స్ట్రీమింగ్‍లో సూపర్ ఓపెనింగ్ అందుకుంది. విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన ఈ మూవీ రూ.300కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లతో టాలీవుడ్‍లో రీజనల్ చిత్రాల్లో ఆల్‍టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‍లోనూ అదే జోరుతో చరిత్ర సృష్టించింది.

జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఆల్‍టైమ్ రికార్డు సృష్టించింది. స్ట్రీమింగ్‍కు వచ్చిన 12 గంటల వ్యవధిలోనే 1.3 మిలియన్ల (13 లక్షలు) మంది వ్యూవర్స్ ఈ చిత్రాన్ని చూశారు. 100 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలు నమోదయ్యాయి. జీ5 ఓటీటీలో ఇది కొత్త రికార్డుగా నిలిచింది.

సంక్రాంతికి వస్తున్నాం చిత్రం జీ5 ఓటీటీలో కొత్త చరిత్ర క్రియేట్ చేసింద...