భారతదేశం, ఫిబ్రవరి 18 -- విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం భారీ బ్లాక్‍బస్టర్ సాధించింది. అందరి అంచనాలను దాటేసి కలెక్షన్లను దక్కించుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ కామెడీ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలైంది. పాజిటివ్ టాక్‍తో కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీలోకి ఇంకా రాలేదు. టీవీ ఛానెల్‍లోకే ముందు అడుగుపెట్టనుంది. ఈ తరుణంలో తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్‍పై రూమర్లు బయటికి వచ్చాయి.

సంక్రాంతికి వస్తున్నాం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 ఓటీటీ సొంతం చేసుకుంది. శాటిలైట్ హక్కులను జీ5 తెలుగు ఛానెల్ తీసుకుంది. ఓటీటీ కంటే ముందుగా టీవీలోనే టెలికాస్ట్ చేయనున్నట్టు ఇటీవల జీ తెలుగు ప్రకటించింది. అయితే, ఓటీటీ స్ట్రీమింగ్‍పై తాజాగా ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది. ట...