భారతదేశం, మార్చి 2 -- సంక్రాంతికి వస్తున్నాం చిత్రం థియేటర్లలో రిలీజైన 46 రోజుల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ బ్లాక్‍బస్టర్ ఫ్యామిలీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ కోసం కొంతకాలంగా ప్రేక్షకులు ఎంతో ఎదురుచూశారు. విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన ఈ మూవీ ఎట్టకేలకు శనివారం (మార్చి 1) స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. అయితే, సంక్రాంతికి వస్తున్నాం స్ట్రీమింగ్‍లో ఓ విషయంలో ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

సంక్రాంతికి వస్తున్నాం సినిమా జీ5 ఓటీటీలోకి అదనపు సీన్లతో వస్తుందనే అంచనాలు ఇటీవల బయటికి వచ్చాయి. ఓటీటీ వెర్షన్ రన్‍టైమ్ ఎక్కువగా ఉంటుందనే వాదన వినిపించింది. థియేట్రికల్ వెర్షన్‍లో కొన్ని కామెడీ సీన్లను కట్ చేశారని, వాటిని ఓటీటీ వెర్షన్‍లో యాడ్ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే, ఈ మూవీ జీ5 స్ట్రీమింగ్‍కు అదనపు సన్నివేశాలు ఏవీ యాడ్ కాలేదు....