Hyderabad, మార్చి 4 -- Sankranthiki Vasthunam OTT: సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఓటీటీలో రికార్డుల పరంపర కొనసాగిస్తోంది. జీ5 ఓటీటీలోకి వచ్చిన 12 గంటల్లోనే 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డును అందుకున్న ఈ మూవీ.. ఇప్పుడు 48 గంటల్లోనే 200 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు అందుకుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ వెల్లడించింది. జీ5 ఓటీటీలో బిగ్గెస్ట్ ఓపెనింగ్ మూవీగా నిలిచింది.

వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.300 కోట్లు వసూలు చేసిన తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. గత శనివారం (మార్చి 1) సాయంత్రం 6 గంటలకు జీ5 ఓటీటీలోకి వచ్చింది. తొలి 12 గంటల్లోనే 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ అందుకొని ఆర్ఆర్ఆర్, హనుమాన్ లాంటి సినిమాల రికార్డులను తిరగరాసింది.

ఇక ఇప్పుడు 48 గంటల్లో 200...