భారతదేశం, ఫిబ్రవరి 11 -- ఇటీవలి కాలంలో సినిమాలు ముందుగా ఓటీటీ స్ట్రీమింగ్‍కు వచ్చిన తర్వాత మరికొన్ని నెలలకు టీవీ ఛానెల్‍లో ప్రసారం అవుతున్నాయి. డిజాస్టర్ అయి డీల్ జరగని అతికొన్ని చిత్రాలు మాత్రమే ఓటీటీలోకి రాకుండా టీవీల్లోకి వస్తున్నాయి. ఇవి కూడా అరుదే. అత్యధిక చిత్రాలు ఓటీటీలోకి వచ్చాకే టీవీ ఛానెల్‍ల్లో టెలికాస్ట్ అవుతున్నాయి. దీంతో టీవీ ప్రీమియర్లకు పెద్దగా టీఆర్పీలు దక్కడం లేదు. ఈ తరుణంలో బంపర్ బ్లాక్‍బస్టర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం ఓ విభిన్నమైన వ్యూహం అనుసరిస్తోంది. ఈ మూవీకి ఎంతో క్రేజ్ ఉండగా.. ముందు ఓటీటీలో కాకుండా టీవీ ఛానెల్‍లో టెలికాస్ట్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఇప్పుడు దీనిపైనే అందరి దృష్టి నెలకొంది.

ఓటీటీ హవా ఉన్న ప్రస్తుత తరుణంలో సూపర్ హిట్ అయిన చిత్రాలు కూడా టీవీల్లో సరైన టీఆర్పీలు దక్కించుకోలేకపోతున్నాయి. ఎక్కువ మంది...