భారతదేశం, ఫిబ్రవరి 28 -- విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍కు రెడీ అయింది. ఈ చిత్రం ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కంటే ముందు టీవీలో టెలికాస్ట్ డేట్ ఫిక్స్ చేసుకొని ఆశ్చర్యపరిచింది. దీంతో స్ట్రీమింగ్ ఎప్పుడనే సస్పెన్స్ నెలకొంది. అయితే, ఇప్పుడు అంతా క్లియర్ అయింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍పై అఫీషియల్‍గా క్లారిటీ వచ్చేసింది.

సంక్రాంతికి వస్తున్నాం సినిమా జీ5 ఓటీటీలో రేపు (మార్చి 1) సాయంత్రం 6 గంటలకు స్ట్రీమింగ్‍కు రానుంది. ఇందుకు సంబంధించి యాప్‍లో ఓ ప్రోమోను కూడా జీ5 తీసుకొచ్చేంది. జీ తెలుగు ఛానెల్‍లోనూ రేపు సాయంత్రం 6 గంటలకు ఈ మూవీ టెలికాస్ట్ కానుంది. ఇలా టీవీలో ప్రసారమయ్యే సమయానికి.....