భారతదేశం, ఏప్రిల్ 9 -- Sangareddy Tragedy: రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాల్లో రోడ్డు ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. శారీరక శ్రమపై ఆధారపడిన కుటుంబాల వీధిన పడ్డాయి. విధి వారి జీవితాలను ఒక విషాదభరితమైన నాటకంగా మార్చింది. స్నేహితులు మూడు రోజుల వ్యవధిలో మృత్యు ఒడిలోకి చేరుకున్న విషాద ఘటన తెలంగాణ-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం...

సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్ మండలం రత్నాపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు స్నేహితులు కూలీ పనులకు వెళుతుంటారు. మున్నూరు రమేష్ (45) , ఇస్మాయిల్ (24), చాకలి బస్వరాజ్ (47) రోజులాగే ఆదివారం ఉదయం నవ్వుతూ ఇంటి నుంచి కూలి పనికి వెళ్లారు. కర్ణాటకలోని బీదర్ ప్రాంతానికి కూలి పనికి వెళ్లారు.

పని ముగించుకుని బైక్‌పై తిరిగి వస్తుండగా బీదర్ జిల్లాలోని బాల్కి ఖానాపూర్...