మెదక్,తెలంగాణ, జనవరి 26 -- సంగారెడ్డి పట్టణంలోని ఏపీహెచ్ బి కాలనీ లో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో పని చేయించారు. క్రీడా మైదానంలో ఉన్న రాళ్లు ఇతర సామాగ్రిని విద్యార్థులతో మోయిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు విచారణకు ఆదేశించి.. చర్యలు చేపట్టారు. ముగ్గురు మహిళా ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. ఈ మేరకు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఉత్తర్వులు ఇచ్చారు.

సదరు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారిని కలెక్టర్ ఆదేశించారు. విచారణ జరిపిన జిల్లా విద్యాధికారి. పాఠశాలకు చెందిన ముగ్గురు ఎస్జీటీ ఉపాధ్యాయులు మంజుల, శారద, నాగమణిలను సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ విషయంపై కార్మిక శాఖ అధికారులతో కలెక్టర్ విచారణకు ఆదేశించారు.

పాఠశాలలోని ప్రహారీగోడ కట్ట...