భారతదేశం, ఏప్రిల్ 15 -- Sangareddy Crime: కుటుంబ కలహాలతో కట్టుకున్న భార్యను రోకలి బండతో దారుణంగా కొట్టి చంపడమే కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిన అత్తపై కూడా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది.

సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. జిల్లాలోని పఠాన్ చెరువు మండలంలో ఉన్న పెద్దకంజర్ల గ్రామంలో భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు. గ్రామస్తులు, కుటుంసభ్యుల సమాచారం ప్రకారం, గ్రామానికి చెందిన రమిలా (25) కు, జిన్నారం మండలంలోని కిస్టాయిపల్లి గ్రామానికి చెందిన సురేష్ (32) తో ఐదు సంవత్సరాల క్రితం ఘనంగా వివాహం జరిగింది. ఈ దంపతులకు, సాత్విక (3) అనే కూతురు కూడా ఉన్నది.

పెళ్లైన మొదటి నాలుగు సంవత్సరాలు అన్యోన్యంగా ఉన్న ఈ దంపతులకు, ఉప్పు నిప్పుల మారిపోయారు. గత కొంత కాలంగా రమిలా, సురేష్ ల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండటంతో పెద్దమనుష...