భారతదేశం, ఫిబ్రవరి 17 -- Sangareddy Crime: పెళ్ళై ఇద్దరు పిల్లలున్న యువకుడు మైనర్ బాలికపై కన్నేశాడు. ఆమెతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఇది తెలుసుకున్న బాలిక తండ్రి అతడిని ముక్కలు ముక్కలుగా నరికి శవాన్ని కాల్చివేయడం కలకలం రేపింది.

పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్న ఒక యువకుడు, స్కూలుకు వెళ్లే మైనర్ బాలికను ప్రేమ పేరుతో తప్పు దోవ పట్టిస్తున్నాడని కక్ష పెంచుకున్న బాలిక తండ్రి, ఆ యువకుడిని ముక్కలు ముక్కలుగా నరికాడు. ఈ సంఘటన, సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ ప్రాంతంలో సంచలనం సృష్టించింది.

వివరాల్లోకి వెళితే జిల్లాలోని నిజాంపేట్ మండలంలో ఉన్న రామచంద్ర తండా కు చెందిన దశరథ్ (26) కు పెళ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాను సంగారెడ్డి పట్టణంలో ఉంటూ, గణపతి షుగర్ కంపెనీ లో లారీ డ్రైవర్ గ పనిచేస్తూ గత కొంత కాలంగా జీవనం సాగిస్తున్నాడు.

కొంత కాలంగా మృతుడు దశరథ...