భారతదేశం, ఫిబ్రవరి 25 -- Sangareddy Collector: సంగారెడ్డి మండలం పసల్వాడి గ్రామం సమీపంలోని డబుల్ బెడ్ రూమ్ గృహ సముదాయం సమీపంలో ఎనిమిదేండ్ల మైనర్ బాలికపై అత్యాచారం ఒక దురదృష్టకరమని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. కలెక్టర్ క్రాంతి సోమవారం బాలిక గృహానికి స్వయంగా వెళ్లి ఆమెను, తన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ ఘటనపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. తదనంతరం, సంబంధిత అధికారులతో సమావేశమై, దోషులను కఠినంగా శిక్షించేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు .

మైనర్లపై అత్యాచార సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రజలకు హామీ ఇచ్చారు. బాధితురాలి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం అని కలెక్టర్ తెలిపారు. బాధితురాలి తల్లిదండ్రులను ఓదార్చి, నిందితుడి పై కఠినమైన చర్యలు...