భారతదేశం, ఫిబ్రవరి 6 -- జిల్లా కేంద్రం సంగారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కొత్తగా ఇందిరమ్మ మహిళ శక్తి క్యాంటీన్‌ను ప్రారంభించారు. ఈ క్యాంటీన్ యజమాన్యం టీ, టిఫిన్‌లను అధిక ధరలకు విక్రయిస్తోందని.. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి ఆరోపించారు. ఫలితంగా ఇక్కడికి వచ్చిన ప్రజలు, కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ హాస్పిటల్ అంటేనే పేదలు, కార్మికులు వస్తుంటారని.. ఇక్కడ రేట్లు ఎక్కువగా పెంచడంతో ఇబ్బందులు పడుతున్నారని యాదగిరి వివరించారు.

హాస్పిటల్‌లో క్యాంటీన్ నడుపుతున్న యాజమాన్యానికి రూమ్ రెంటు లేదు.. కరెంట్ బిల్లు లేదు.. కానీ పేద ప్రజల నుండి టిఫిన్‌కి 40 రూపాయలు, టీకి 15 రూపాయలు తీసుకుంటున్నారని.. యాదగిరి ఆరోపించారు. ప్రజలను, కార్మికులను దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి బయట ఉన్న హోటల్స్....