హైదరాబాద్,తెలంగాణ, జనవరి 3 -- సంథ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్‌కు ఊరట లభించింది. ఆయనకు నాంపల్లి కోర్టు రెగ్యులర్‌ బెయిల్‌ ను మంజూరు చేసింది. రూ.50 వేలతో పాటు రెండు పూచీకత్తులపై బెయిల్‌ మంజూరు ఇచ్చింది. ఇప్పటికే ఈ కేసులో హైకోర్టు.. మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయన్ను విచారించిన పోలీసులు. అరెస్ట్(డిసెంబరు 13) చేశారు. పోలీసుల కేసుతో పాటు అరెస్ట్ ను సవాల్ చేస్తూ అల్లు అర్జున్ హైకోర్టును కూడా ఆశ్రయించారు. వాదోపవాదనలు తర్వాత. అదే రోజు అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు చేసింది. అయితే నాంపల్లి కోర్టు రిమాండ్ విధించటంతో ఆయన్ను జైలుకు తరలించారు. బెయిల్ పేపర్లు ఆలస్యంగా అందటంతో ఆ రోజు రా...