Hyderabad, ఫిబ్రవరి 25 -- Sandeep Reddy Vanga: యానిమల్ మూవీని విమర్శించిన బాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్లకు మరోసారి గట్టి సమాధానం ఇచ్చాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. బ్లాక్‌బస్టర్ అయిన ఈ సినిమాలో హింస, పురుషాహంకారం మితిమీరిందంటూ చాలా మంది సినీ పెద్దలే విమర్శించారు. దీనిపై తాజాగా యూట్యూబ్ ఛానెల్ గేమ్ ఛేంజర్స్ తో మాట్లాడుతూ సందీప్ మరోసారి స్పందించాడు.

తన యానిమల్ మూవీని తిట్టి.. అందులో నటించిన రణ్‌బీర్ కపూర్ ను పొగడటంపై సందీప్ రెడ్డి ఈ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఈ సందర్భంగా బాలీవుడ్ వాళ్లను ఉద్దేశించి అతడు మాట్లాడిన తీరు ఆసక్తికరంగా ఉంది. "ఓ విషయం నేను చెబుతాను. యానిమల్ సినిమాను తిట్టిన సినిమా ఇండస్ట్రీ వాళ్లంతా రణ్‌బీర్ మాత్రం ఇరగదీశాడని అన్నారు.

నాకు రణ్‌బీర్ అంటే ఈర్శ్య లేదు. కానీ ఈ తేడా మాత్రం నాకు అర్థం కావడం లేదు. నాకు అర్థమైందేంటంటే వాళ్లు ...