భారతదేశం, మార్చి 1 -- తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. పాన్ ఇండియా రేంజ్‍లో స్టార్ డైరెక్టర్ అయ్యారు. తన తొలి మూవీ అర్జున్ రెడ్డి(2017)తో సెన్సేషన్ క్రియేట్ చేశారు. బ్లాక్‍బస్టర్ కొట్టారు సందీప్. అదే మూవీని బాలీవుడ్‍లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి సక్సెస్ సాధించారు. 2023లో యానిమల్ మూవీతో బాక్సాఫీస్‍ను సందీప్ షేక్ చేశారు. మూడు చిత్రాలతోనే దేశంలో టాప్ డైరెక్టర్ల జాబితాలో చేరారు. తాను అనుకున్న విధంగా సినిమాలు తీసే ఆయన.. విమర్శలకు కూడా సూటిగా, గట్టిగా సమాధానాలు ఇస్తుంటారు. తాజాగా మరో ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగా పాల్గొన్నారు. తన జీవితంలో ముఖ్యమైన రోజు ఏదో వెల్లడించారు.

అర్జున్ రెడ్డి టీజర్ రిలీజ్ చేసిన రోజు అద్భుతమైన భారీ రెస్పాన్స్ వచ్చిందని, ఆరోజే తమ జీవితం మారిపోయిందని అనిపించిందని సందీప్ వంగా తెలిపారు. కోమల్ నహతాకు ఇచ్చిన ఇంటర్వ్...