భారతదేశం, ఫిబ్రవరి 3 -- నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన తండేల్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ హుషారుగా జరిగింది. ఫిబ్రవరి 7న ఈ చిత్రం రిలీజ్ కానుండగా.. ఆదివారం ఈవెంట్‍ను మూవీ టీమ్ నిర్వహించింది. ఈ ఈవెంట్‍కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రావాల్సింది. కానీ హాజరు కాలేదు. ఈ ఈవెంట్‍కు స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. చీఫ్ గెస్టుగా వచ్చారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన విషయం చెప్పారు. తన ఫస్ట్ మూవీ అర్జున్ రెడ్డి నాటి ఓ విషయాన్ని పంచుకున్నారు. సాయిపల్లవిపై ప్రశంసలు కురిపించారు.

ప్రేమమ్ నుంచి సాయిపల్లవి యాక్టింగ్ అంటే తనకు చాలా ఇష్టమని సందీప్ రెడ్డి వంగా చెప్పారు. అర్జున్ రెడ్డి చిత్రంలో సాయిపల్లవినే హీరోయిన్‍గా తీసుకుందామని తాను ముందుగా అనుకున్నానని సందీప్ వెల్లడించారు. అయితే, అది ఎందుకు సాధ్యం కాలేదో వివరించారు.

అర్జున...