భారతదేశం, ఫిబ్రవరి 4 -- Samsung Walk-a-thon: తమ వినియోగదారులు చురుకుగా ఉండటానికి, వారి ఫిజికల్ యాక్టివిటీలను ట్రాక్ చేయడానికి ప్రోత్సహించడానికి శాంసంగ్ ఇండియా 'వాక్-ఎ-థాన్ ఇండియా' ఛాలెంజ్ అనే కొత్త ఫిట్ నెస్ చాలెంజ్ ను ప్రారంభించింది. ఈ ఛాలెంజ్ లో భారతదేశం అంతటా ఉన్న శామ్ సంగ్ హెల్త్ యాప్ వినియోగదారులు పాల్గొనవచ్చు. వారి ఫిట్ నెస్ ప్రయత్నాలకు రివార్డులు కూడా పొందవచ్చు.

శాంసంగ్ లేటెస్ట్ ఫిట్ నెస్ ఛాలెంజ్ ఏంటంటే.. ఈ నెలలో, అంటే ఫిబ్రవరి 28వ తేదీ వరకు మీరు 2 లక్షల అడుగులు నడవాలి. 2 లక్షల అడుగుల నడక పూర్తయిన వారు గెలాక్సీ వాచ్ అల్ట్రాను గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఈ ఛాలెంజ్ పూర్తి చేసినవారిలో ముగ్గురిని ర్యాండమ్ గా ఎంపిక చేసి గెలాక్సీ వాచ్ అల్ట్రాను అందజేస్తారు. ఈ 'వాక్-ఎ-థాన్ ఇండియా' ఛాలెంజ్ జనవరి 30 నుండి ఫిబ్రవరి 28, 2025 వరకు కొనసాగుతుంది...