భారతదేశం, మార్చి 7 -- శాంసంగ్ గెలాక్సీ ఏ36తో పాటు గెలాక్సీ ఏ56 భారత్​లో లాంచ్​ అయ్యింది. కొత్త గెలాక్సీ ఏ సిరీస్​లో ఇన్​స్టెంట్​ స్లో-మో, ఏఐ సెలెక్ట్, మెరుగైన సర్కిల్ టు సెర్చ్ వంటి అధునాతన ఏఐ ఆధారిత ఫీచర్లు ఉన్నాయి. ఇప్పటికీ విపరీతమైన పోటీ ఉన్న మిడ్-రేంజ్ స్మార్ట్​ఫోన్​ మార్కెట్లో ఈ ఫీచర్లు గెలాక్సీ ఏ సిరీస్​ ఆకర్షణను పెంచుతాయి. గెలాక్సీ ఏ56 గెలాక్సీ ఏ సిరీస్​కు అప్​గ్రేడ్ ఫీచర్లను తీసుకువస్తుండగా, ఎస్24 ఎఫ్​ఈతో ప్రీమియం ఎక్స్​పీరియెన్స్​ని పొందవచ్చు. ఈ నేపథ్యంలో ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​ని పోల్చి, ఏది బెస్ట్​? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..

శాంసంగ్​ గెలాక్సీ ఏ56లో లీనియర్ ఫ్లోటింగ్ కెమెరా మాడ్యూల్, 'రేడియెన్స్ ప్రేరేపిత కలర్ స్కీమ్'తో కొత్త డిజైన్ ఉంది. ఈ మోడల్ గెలాక్సీ ఏ సిరీస్​లో అత్యంత స్లిమ్​గా ఉంది. దీని థిక్​నెస్​ కేవలం 7.4 ఎంఎం. గె...