భారతదేశం, ఫిబ్రవరి 19 -- Samsung Galaxy A06 5G launch: గెలాక్సీ ఎ06 5జి లాంచ్ తో భారతదేశంలో తన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లైనప్ ను శాంసంగ్ విస్తరించింది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ను అందించే 6.7 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే, ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ యూఐ 7 ఆపరేటింగ్ సిస్టంపై ఈ సరికొత్త 5జీ హ్యాండ్ సెట్ పనిచేయనుంది.

గెలాక్సీ ఎ06 5జీ స్మార్ట్ ఫోన్ మూడు కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.10,499 గా నిర్ణయించారు. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,499 కాగా, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999గా ఉంది. వినియోగదారులు బ్లాక్, గ్రే, లైట్ గ్రీన్ అనే మూడు కలర్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. అదనపు ప్రోత్సాహకంగా, శామ్సంగ్ తన శాంసంగ్ కేర్ + ప్రోగ్రామ్ ద్వారా కేవలం రూ. 129 కు ఒక సంవత్...