భారతదేశం, మే 3 -- Samshabad Leopard: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో అటవీ శాఖ ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. గత వారం రోజులుగా చిరుతను పట్టుకునేందుకు అటవీ శాఖ విశ్వప్రయత్నాలు చేస్తోంది. గత వారం చిరుతను గుర్తించిన విమానాశ్రయ సిబ్బంది అటవీశాఖకు సమాచారం ఇచ్చారు.

చిరుతను బంధించేందుకు బోనులు ఏర్పాటు చేసినా వాటికి చిక్కకుండా తిరుగుతోంది. రెండ్రోజుల క్రితం ఏకంగా రన్ వేపై ప్రత్యక్షమైంది. చిరుత పట్టుకునేందుకు ఫారెస్ట్ సిబ్బంది, పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఓ దశలో చిరుత బోనులో చిక్కకపోవడంతో దానిని మత్తు మందు ఇచ్చి బంధించాలని భావించారు.

సీఐఎస్ఎఫ్ అధికారులు కూడా చిరుత ఎయిర్‌పోర్ట్‌లోకి రాకుండా అప్రమత్తంగా వ్యవహరించారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్ వేకు సమీపంలో గత ఆదివారం చిరుత కలకలం సృష్టంచింది. ఆదివారం తెల్లవారుజామున ఎయిర్ పోర్టు పెట్రోలిం...