భారతదేశం, మార్చి 22 -- సాయిధ‌ర‌మ్‌తేజ్ గాంజా శంక‌ర్ ఆగిపోయిన‌ట్లు ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. సినిమాను అనౌన్స్ చేసిన త‌ర్వాత టైటిల్ మార్చ‌మ‌ని త‌మ‌కు పోలీసులు నోటీసులు పంపించార‌ని సంప‌త్ నంది తెలిపాడు. సాయిధ‌ర‌మ్‌తేజ్‌తో పాటు త‌న‌కు, నిర్మాత‌ల‌కు పోలీసులు నోటీసులు ఇచ్చార‌ని చెప్పాడు.

సాయిధ‌ర‌మ్‌తేజ్ హీరోగా సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో గాంజా శంక‌ర్ పేరుతో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై ప్రొడ్యూస‌ర్ సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఓ సినిమాను అనౌన్స్‌చేశారు. ఈ సినిమా గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. గ్లింప్స్ రిలీజై ఏడాది దాటినా సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. గాంజా శంక‌ర్ ఆగిపోయిన‌ట్లు కొన్నాళ్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ పుకార్ల‌పై ఓదెల 2 ప్రెస్‌మీట్‌లో డైరెక్ట‌ర్ సంప‌త్ నంది క్లారిటీ ఇచ్చాడు. గాంజా శంక‌ర్ ఆగిపో...