Hyderabad, ఫిబ్రవరి 21 -- Sammelanam Web Series Review And Rating In Telugu: ఓటీటీలోకి నేరుగా వచ్చిన తెలుగు రొమాంటిక్ లవ్ స్టోరీ వెబ్ సిరీస్ సమ్మేళనం. ఫిబ్రవరి 20 నుంచి ఈటీవీ విన్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న సమ్మేళనం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

హుషారు ఫేమ్ ప్రియా వడ్లమాని, విజ్ఞయ్ అభిషేక్, శ్రీకాంత్ గుర్రం, శ్రీకాంత్ యాచమనేని, బిందు నూతక్కి, గణాదిత్య, జీవణ ప్రియా రెడ్డి కీలక పాత్రలు పోషించిన ఈ సిరీస్‌కు తరుణ్ మహదేవ్ దర్శకత్వం వహించారు. సునయని బి, సాకేత్ జె నిర్మించిన ఈ ఓటీటీ తెలుగు రొమాంటిక్ వెబ్ సిరీస్ ఎలా ఉందో నేటి సమ్మేళనం రివ్యూలో తెలుసుకుందాం.

రామ్ (గణాదిత్య) ఓ రైటర్. రామ్ రాని ఓ పుస్తకానికి మంచి స్పందన వచ్చి అతని ఫొటోతో పాటు బుక్ గురించి పేపర్లలో ఫ్రంట్ పేజీలో పడుతుంది. దీంతో రామ్‌ను వెతుక్కుంటూ రాహుల్ (శ్రీకాంత్ యాచమనేని) శ్రీయా ...