Hyderabad, ఫిబ్రవరి 9 -- Same Music Directors In Every Movie: సినిమాల్లో హీరో-డైరెక్టర్, హీరో-హీరోయిన్ ఇలా కొన్ని కాంబినేషన్స్ అదిరిపోతుంటాయి. అందుకే వారితో రిపీటెడ్‌గా సినిమాలు చేస్తుంటారు. అలాగే, సినిమాను నిలబెట్టే బీజీఎమ్, సంగీతం విషయంలో కూడా ఇదే కాంబోను రిపీట్ చేస్తుంటారు హీరోలు, దర్శకులు.

ఇక హీరోలకు తగినట్లు ఎలివేట్ ఇచ్చే సంగీత దర్శకులు కొంతమంది ఉంటారు. అందుకే వారిని కూడా తమ ప్రతి సినిమాలో అవకాశం ఇస్తుంటారు. ఇలా తమ ప్రతి సినిమాలో ఒకే మ్యూజిక్ డైరెక్టర్‌ను తీసుకున్న హీరోలు, దర్శకులు ఎవరో ఇక్కడ లుక్కేద్దాం.

పుష్ప 2తో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్. ఆయన దర్శకుడిగా తెరకెక్కించిన ఆర్య సినిమా నుంచి రీసెంట్ పుష్ప 2 వరకు అన్ని సినిమాలకు సంగీతం అందించిన ఒకే ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్. సుకుమా...