Hyderabad, ఏప్రిల్ 18 -- Samantha Subham Movie: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు కొన్నాళ్ల కిందట ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో సొంత ప్రొడక్షన్ హౌజ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ బ్యానర్లో ఆమె నిర్మిస్తున్న తొలి సినిమా శుభం. హారర్ కామెడీ జానర్లో వస్తున్న ఈ సినిమా రిలీజ్ తేదీని సమంత శుక్రవారం (ఏప్రిల్ 18) అనౌన్స్ చేసింది.

సమంత ప్రొడ్యూస్ చేసిన మూవీ శుభం. ఈ మూవీ మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. "మీకు శుభం కలుగుగాక. మే 9న మిమ్మల్ని థియేటర్లలో కలుస్తా" అనే క్యాప్షన్ తో సమంత రిలీజ్ తేదీని అనౌన్స్ చేసింది.

కొన్ని రోజుల కిందట ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. గత నెల 30వ తేదీన ఈ టీజర్ తీసుకొచ్చారు. శుభం సినిమాకు సినిమాబండి ఫేమ్ డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం...