Hyderabad, ఏప్రిల్ 19 -- Samantha Ruth Prabhu Rating To Naga Chaitanya Hrithik Roshan: అందగాడు అంటే ఉదాహరణకు చూపించే హీరోల్లో హృతిక్ రోషన్ ముందుంటాడు. బాలీవుడ్ గ్రీక్ గాడ్ అంటూ హృతిక్ రోషన్‌కు బిరుదు కూడా ఉంది. ఎంతోమంది అమ్మాయిలకు హృతిక్ రోషన్ అన్నా, తన బాడీ, లుక్స్ అంటే విపరీతమైన ఇష్టం.

అలాంటి హృతిక్ రోషన్ లుక్స్ అంటే తనకు మాత్రం నచ్చదని సౌత్ స్టార్ హీరోయిన్ సమంత చెప్పుకొచ్చింది. అంతేకాకుండా లుక్స్‌లో హృతిక్ రోషన్ కంటే నాగ చైతన్యకు ఎక్కువ రేటింగ్ ఇవ్వడం మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది ఈ విషయం. ఇప్పుడు ఈ టాపిక్ సోషల్ మీడియాలో హాట్‌గా వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే.. ఏ మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సమంత కెరీర్ తొలి నాళ్లలో పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంది. ఓ న్యూస్ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో లుక్స్ ఆధారంగా హీరోలకు రేటింగ్ ఇ...