Hyderabad, మార్చి 4 -- Samantha on Ye Maaya Chesave: సమంత రుత్ ప్రభు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 15 ఏళ్లు పూర్తయ్యాయి. 2010లో వచ్చిన ఏ మాయ చేసావే మూవీతో ఆమె ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గౌతమ్ వాసుదేవ్ మేనన్ డైరెక్ట్ చేసిన ఆ సినిమాలో సామ్.. తన మాజీ భర్త నాగ చైతన్యతో కలిసి నటించింది. తన 15 ఏళ్ల సినిమా జర్నీ ప్రారంభమైన ఆ సినిమా గురించి ఆమె ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది.

సమంత ఈ మధ్యే టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏ మాయ చేసావే మూవీ గురించి స్పందించింది. అంతేకాదు ఈ 15 ఏళ్ల సినీ ప్రయాణంపైనా మాట్లాడింది. కొన్ని సినిమాల్లో భాష తెలియక తాను దారుణంగా నటించానని, తనను గైడ్ చేయడానికి కూడా ఎవరూ లేరని చెప్పింది.

నిజానికి ఏ మాయ చేసావే కంటే ముందు రాహుల్ రవీంద్రన్ తో కలిసి మాస్కోవిన్ కావేరీ అనే సినిమాలో నటించినా.. అది తర్వాత రిలీజైంది.

"...