Hyderabad, మార్చి 16 -- Samantha In Hospital Bed And Fans Worried: స్టార్ హీరోయిన్ సమంత మరోసారి హాస్పిటల్‌లో చేరింది. ఇదివరకే మయోసైటిస్‌తో బాధపడుతున్న సమంత మెరుగైన చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, అప్పుడప్పుడు ఇలా హాస్పిటల్‌లో ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ తన గురించి ఫ్యాన్స్‌కు తెలిసేలా చేస్తుంటుంది సామ్.

తాజాగా అలాగే, తను షేర్ చేసిన కొన్ని ఫొటోల్లో హాస్పిటల్ బెడ్‌పై సమంత ఉంది. వైట్ కలర్ టీ షర్ట్‌లో ఆస్పత్రి బెడ్‌పై సమంత ఉన్న ఫొటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దాంతో సమంతకు మళ్లీ ఏమైందని ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. సమంత త్వరగా కోలుకోవాలని సామ్ ఫ్యాన్స్‌తోపాటు నెటిజన్స్ కూడా ఆ ఫొటోలకు కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే, మరోవైపు కొత్త పెళ్లి జంట నాగ చైతన్య, శోభితా ధూళిపాళ టూర్‌లతో చక్కర్లు కొడుతున్నారు. నాగ చైతన్య-శోభి...