Hyderabad, ఫిబ్రవరి 5 -- సమంత సినిమాలతోనే కాదు వ్యక్తిగత జీవితంలో వచ్చిన గొడవల ద్వారా కూడా పాపుల్ అయింది. నాగచైతన్యతో విడాకులు తరువాత ఆమె మానసికంగా చాలా కుంగిపోయినట్టు కనిపించింది. అలాగే మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధి వల్ల కూడా ఆమె ఎంతో ఇబ్బంది పడింది. సమంత మన మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలో ఎప్పటికప్పుడు తన ఇన్ స్టా ఖాతా ద్వారా చెబుతూ ఉంటుంది.

ధ్యానం అనేది మనస్సు, శరీరాన్ని శాంతపరచడానికి సహాయపడుతుంది. ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి భావాలను కూడా తగ్గిస్తుందని సమంత వివరిస్తోంది. మయోసిటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో తాను పడిన కష్టాల గురించి, అలాగే 2021 లో నాగచైతన్యతో విడాకులు తీసుకోవడం తన మానసిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేసిందో ఓపెన్ గా చెప్పింది సమంత రూత్ ప్రభు.

జిక్యూ ఇండియాకు ఇచ్చిన కొత్త ఇంటర్వ్యూలో సమంత రూత్ ప్ర...