Hyderabad, మార్చి 22 -- ఉప్పు ప్రతి ఇంట్లోనూ ఉండేది, దాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించేదే. కానీ దీన్ని కేవలం వంటల్లోకి మాత్రమే ఉపయెగిస్తున్నారంటే మీరు ఉప్పుతో కలిగిన ప్రయోజనాలను చాలా వరకూ మిస్ అవుతున్నట్టే. ఎందుకంటే ఉప్పు ఆహారం రుచిని మెరుగుపరచడానికి మాత్రమే కాదు, ఇంటి శుభ్రత నుండి ఆహార పదార్థాలను చెడిపోకుండా కాపాడటం వరకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. మీరు ఎంతో శ్రమించే వంటింటి పనులను సులభతరం చేయగల శక్తి ఉప్పుకు ఉంది. ఉప్పు గురించి చాలా మందికి తెలియని విషయాలు, అది చేసే చిన్న చిన్న మ్యాజిక్‌లలో కొన్నింటి గురించి తెలుసుకుందాం రండి..

ఈ బిజీబిజీ జీవితంలో ఆహార పదార్థాలను, పాలను ప్రతిసారి బయటకు వెళ్లి తెచ్చుకోవడం కష్టమైన పని. అందుకే ఒకేసారి తెచ్చుకుని నాలుగు అయిదు రోజు లేదా వారం రోజుల పాటు స్టోర్ చేసుకుని ఉపయోగించుకుంటున్నాం. అలా తెచ్చి పెట్టుకున్న ప...