Hyderabad, ఫిబ్రవరి 18 -- ఉప్పు అధికంగా తినడం వల్ల శరీరంలో హై బీపీ వస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకే ఉప్పును తక్కువగా తినమని వైద్యులు సూచిస్తూ ఉంటారు. అయితే ఉప్పు అధికంగా తినడం వల్ల కేవలం హై బీపీ మాత్రమే కాదు. మీకు తెలియకుండానే ఒక ప్రమాదకరమైన క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. అదే పొట్ట క్యాన్సర్. ఉప్పు రుచి కోసం మాత్రమే తింటారు.

అలాగే ఉప్పులో ఉండే అయోడిన్ కూడా మన శరీరానికి అవసరం. దీనికోసం మీరు ఎక్కువ మొత్తంలో ఉప్పు తినాల్సిన అవసరం లేదు. అయోడిన్ ఇతర ఆహార పదార్థాలలో కూడా ఉంటుంది. ఉప్పులో ఉండే సోడియం శరీరానికి ఎంతో హాని చేస్తుంది.అందుకే వైద్యులు ఉప్పును తగ్గించమని చెబుతారు.

అధిక ఉప్పు రుచిని పాడు చేయడమే కాకుండా మన ఆరోగ్యం పై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది అనేక వ్యాధులకు దారితీస్తుంది. ముఖ్యంగా పొట్ట క్యాన్సర్ తో దీనికి అవినాభావ ...