భారతదేశం, మార్చి 23 -- Salman Khan: స‌ల్మాన్ ఖాన్‌, ర‌ష్మిక మంద‌న్న హీరోహీరోయిన్లుగా న‌టించిన సికంద‌ర్ మూవీ ట్రైల‌ర్ ఆదివారం రిలీజైంది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీకి కోలీవుడ్ డైరెక్ట‌ర్ ఏఆర్ మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది.

ఆదివారం ముంబాయిలో సికంద‌ర్ మూవీ ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌ను నిర్వ‌హించారు. ఈ ఈవెంట్‌లో ర‌ష్మిక మంద‌న్న‌తో ఏజ్ గ్యాప్‌పై స‌ల్మాన్ ఖాన్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. స‌ల్మాన్ ఖాన్ కంటే ర‌ష్మిక మంద‌న్న 31 ఏళ్లు చిన్న‌ది అంటూ సోష‌ల్ మీడియాలో కొన్నాళ్లుగా ట్రోల్స్ వ‌స్తోన్నాయి.

ఈ ట్రోల్స్‌పై ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌లో స‌ల్మాన్ ఖాన్ రియాక్ట్ అయ్యాడు. ఏజ్ గ్యాప్ విష‌యంలో ర‌ష్మిక‌కు ఎలాంటి ప్రాబ్లెమ్ లేదు. ఆమె తండ్రికి కూడా స‌మ‌స్య లేదు. మ‌రి ఎవ‌రికి స‌మ‌స్య ఉందో...