Hyderabad, ఫిబ్రవరి 24 -- Salman Khan Biggest Flop Movie Ever: బాలీవుడ్ స్టార్ హీరోల్లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఒకరు. సల్మాన్ ఖాన్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాగే, అతని సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టిస్తాయి. అయితే, అలాంటి సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సినీ కెరీర్‌లో ఓ సినిమా మాత్రం బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా నిలిచింది.

2007లో విడుదలైన సల్మాన్ ఖాన్ సినిమా మ్యారిగోల్డ్. విల్లార్డ్ కారోల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సల్మాన్‌కు హాలీవుడ్ యాక్షన్ హీరోయిన్ అలి లార్టర్ జోడీగా నటించింది. ఆమెతోపాటు మరో అమెరికన్ నటి హెలెన్ కీలక పాత్ర పోషించింది. రొమాంటిక్ కామెడీ చిత్రంగా తెరకెక్కిన మ్యారిగోల్డ్ సినిమా హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఆగస్ట్ 17న విడుదలైంది.

మ్యారిగోల్డ్ ఒక రొమాంటిక్ మ్యూజికల్ కామెడీ జోనర్ మూవీ. మ్యారిగోల్డ్ డైరెక్టర్ విల...