Hyderabad, మార్చి 27 -- Salman Khan: ప్రస్తుతం బాలీవుడ్ లో తమ సొంత సినిమాలనే విమర్శించే వారి సంఖ్య ఎక్కువవుతోంది. సౌత్ సినిమాలు బ్లాక్‌బస్టర్ అవుతున్న వేళ.. హిందీ సినిమా మేకర్స్ అసలు మూవీస్ ఎలా తీయాలో మరిచిపోయారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సల్మాన్ ఖాన్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.

బాక్సాఫీస్ దగ్గర బాలీవుడ్ సినిమాలు బోల్తా ఎందుకు పడుతున్నాయన్న ప్రశ్నకు సల్మాన్ ఖాన్ నిజాయతీగా స్పందించాడు. "ఇంత చెత్త సినిమాలు తీసినప్పుడు ఫ్లాప్ కావాల్సిందే కదా. తీసే సినిమాలన్నీ చెత్తగానే ఉంటున్నాయి. నా సినిమాలు కూడా. అది ఫ్లాప్ అయిందంటే చెత్త సినిమా అనే. హిట్ అయితే బాగుందని అర్థం" అని సల్మాన్ స్పష్టం చేశాడు.

సల్మాన్ ఖాన్ కు కూడా చాలా రోజుల తర్వాత 2023లో కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ మూవీ రూపంలో పెద్ద ఫ్లాప్ ఎదురైంది. పోస్టర్లు, థియేటర్లలో కనిపి...