భారతదేశం, ఫిబ్రవరి 16 -- పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'సలార్' సినిమాకు క్రేజ్ విపరీతంగా ఉంది. థియేటర్లలో ఈ మూవీ బ్లాక్‍బస్టర్ అయింది. 2023 డిసెంబర్ 22న ఈ చిత్రం విడుదలైంది. సూపర్ హిట్ కొట్టింది. థియేట్రికల్ రన్ తర్వాత కూడా ఈ సినిమా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఓటీటీలోనూ దుమ్మురేపింది. చాలా మంది రిపీట్‍గా ఈ చిత్రాన్ని చూశారు. చాలాసార్లు ఎక్స్ (ట్విట్టర్)లో సలార్ ట్రెండ్ అయింది. సలార్ హిందీ వెర్షన్ ఓటీటీలోకి వచ్చి నేటి (ఫిబ్రవరి 16) ఏడాది అయింది.

సలార్ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో 2024 జనవరి 20న స్ట్రీమింగ్‍కు వచ్చింది. భారీ వ్యూస్‍తో అదరగొట్టింది. అయితే, సలార్ హిందీ వెర్షన్ మాత్రం 2024 ఫిబ్రవరి 16వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ (ఇప్పుడు జియోహాట్‍స్టార్) ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట...