భారతదేశం, ఫిబ్రవరి 7 -- Sake Sailajanath: మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు శైలజానాథ్‌ వైసీపీలో చేరారు. కొంతకాలంగా రాజకీయంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న శైలజానాథ్‌ 2023లో టీడీపీలో చేరేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. శైలజానాథ్‌ టీడీపీలో చేరే సమయంలోనే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును సీఐడీ అరెస్ట్‌ చేయడంతో ఆ ప్రయత్నాలు విరమించుకున్నారు. అప్పట్లో రాజమండ్రి వెళ్లి చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని కూడా పరామర్శించారు.

రాష్ట్ర విభజన తర్వాత ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగిన చాలామంది నాయకులకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసింది. ఈ కోవలో అన్ని స్థాయిల నాయకులు ఉన్నారు. మాజీ మంత్రులు కూడా ఉన్నారు. పార్టీలు మారిన వారి పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉన్నా, ఏ పార్టీలోకి వెళ్లాలో తేల్చుకోలేకుండా ఉన్న వారికి మాత్రం ఇబ్బందులు త...