భారతదేశం, మార్చి 16 -- బెట్టింగ్ అన్నది ఒక విష చక్రం.. అందులో చిక్కుకుంటే అంతే సంగతులని.. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెచ్చరించారు. అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సిందేనని వార్నింగ్ ఇచ్చారు. బెట్టింగ్ వల్ల కుటుంబాలు కూడా నష్టపోతాయని చెప్పారు. బెట్టింగ్ యాప్స్‌పై ప్రజలకు అవగాహన వచ్చినప్పుడే వాటిని అరికట్టగలమని అభిప్రాయపడ్డారు. గతంలో లోన్ యాప్స్, మల్టీ లెవల్ మార్కెటింగ్, మైక్రో ఫైనాన్స్ వంటి వాటిపై పోరాటం చేశానని గుర్తు చేశారు.

'సురేఖ వాణి కుమార్తెతో పాటు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే అందరిపైనా కేసులు నమోదు చేయాలి. సన్నీ యాదవ్ లాంటి వాళ్లు చాలా మంది ఉన్నారు. ఈజీ మనీ మాయలో జీవితాలు నాశనం అవుతున్నాయి. బెట్టింగ్ అన్నది ఒక రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాదు.. ఇది దేశానికి సంబంధించిన సమస్య. దీనిపై అందరూ కలిసి పోరాడాలి' అని సజ్జనార్ స్పష్టం చేశారు....