భారతదేశం, ఫిబ్రవరి 18 -- స్టార్ హీరోయిన్ సాయిపల్లవి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికే ఆమెకు జాతీయ ఉత్తమ నటి అవార్డు రావాల్సిందని చాలా మంది నుంచి వినిపించే మాట. గార్గి సినిమాకు గాను గతేడాది ఉత్తమ జాతీయ నటిగా సాయిపల్లవికి పురస్కారం వస్తుందనే అంచనాలు బలంగా వినిపించాయి. అయితే, తిరుచిత్రాబలం మూవీకి గాను నిత్యా మీనన్‍కు ఆ అవార్డు దక్కింది. అయితే, తనకు నేషనల్ అవార్డు గెలువాలని ఉందని, అందుకు ఓ కారణం ఉందని సాయిపల్లవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

అమ్మమ్మ తనకు బహుమతిగా ఇచ్చిన చీర ధరించేందుకు జాతీయ అవార్డు గెలువాలని తాను కోరుకుంటున్నానని గలాటా ప్లస్‍కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయిపల్లవి వెల్లడించారు. "నాకు 21 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మా అమ్మమ్మ నాకు ఓ చీరను ఇచ్చారు. నా పెళ్ళికి దీన్ని ధరించాలని చెప్పారు. ఆ సమయంలో ఆమె చాలా అనారోగ్యంతో ఉన్నారు. ఆ...