Hyderabad, మార్చి 17 -- Actor Sai Kumar On His Dubbing Artist Remuneration: కనిపించే మూడు సింహాలు అనే డైలాగ్‌తో తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని క్రేజ్ తెచ్చుకున్న హీరో సాయి కుమార్. నటుడిగా, హీరోగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న ఆయన కెరీర్ తొలినాళ్లలో డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా సినీ ప్రయాణం మొదలు పెట్టారు.

కెరీర్ తొలి నాళ్లలో డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, పడిన పాట్ల గురించి ఓ ఇంటర్వ్యూలో సాయి కుమార్ చెప్పారు. గతంలోని ఇంటర్వ్యూలో సాయి కుమార్ చెప్పిన ఆ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఇంటర్వ్యూలో "మీరు కూడా చాలా స్ట్రగుల్ అయ్యారు కదా. ఫస్ట్ డబ్బింగ్ ఆర్టిస్టే కదా" అని యాంకర్ అన్నారు.

"అవును, బాగా. ఫస్ట్ 250 రూపాయలు. తర్వాత 500 రూపాయలు" అని సాయి కుమార్ చెబుతుంటే.. "ఏది డబ్బింగ్ చెప్పినందుకా" అని యాంకర్ అన్నారు. "అవ...